జన నాయగన్ రిలీజ్ డేట్ వాయిదా.. రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది
on Jan 8, 2026

-తీవ్ర నిరాశలో విజయ్ ఫ్యాన్స్
-కోర్టు తీర్పు అనుకూలమా!ప్రతికూలమా
-తమిళ మీడియా వర్గాలు ఏమంటున్నాయి
నాలుగు దశాబ్దాల సినీ ఛరిష్మాకి గుడ్ బై చెప్తు ఇళయదళపతి 'విజయ్' సిల్వర్ స్క్రీన్ పై చేస్తున్న చివరి మూవీ 'జననాయగన్'. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఎంతో భావోద్వేగ వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల 9 న రిలీజ్ డేట్ కాగా ఈ రోజు నైట్ నుంచే బెనిఫిట్ షో చూడటం కోసం అభిమానులు భారీ ఎత్తున జరిగాయి. ప్రీ బుకింగ్స్ కూడా తమిళనాడు తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో క్లోజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు వాళ్ల ఆశలకి బ్రేక్ వచ్చింది.
జన నాయగన్ సెన్సార్ సభ్యులు ఇంకా సెన్సార్ ని ఇవ్వలేదన్న వార్తలు రెండు రోజుల నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందం చెన్నై హైకోర్టు ని ఆశ్రయించగా ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తమ తీర్పుని జనవరి 9 నే వెల్లడి చేయనుంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మా నియంత్రణకి మించిన అనివార్య పరిస్థితులు కారణంగా జన నాయగన్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ ని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం’ అని
ఎక్స్ వేదికగా తెలియచేసింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోవడమే కాకుండా రేపు వచ్చే కోర్టు తీర్పు పై ఉత్కంఠతతో ఎదురుచూస్తూ ఉన్నారు.
Also read: ఆ డైరెక్టర్ మన శంకరవరప్రసాద్ గారుకి ప్రతిపక్షమేనా!.. అసలేం జరుగుతుంది
ఇక రిలీజ్ వాయిదా తో సినీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు జన నాయగన్ లో రాజకీయపరమైన సంభాషణలు చాలా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని, సదరు డైలాగ్స్ ని తొలగించమని సెన్సార్ చెప్పినా కూడా చిత్ర యూనిట్ ఒప్పుకోలేదనే విషయాన్నీ వెల్లడి చేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



