ఇస్మార్ట్ కాపీ 'క్రిమినల్' శంకర్!
on Jul 4, 2019
'ఇస్మార్ట్ శంకర్' ట్రైలర్ చూశారా? బుధవారం సాయంత్రం విడుదలైంది. తెలంగాణ యాసలో రామ్ డైలాగులు, పూరి మార్క్ సన్నివేశాలు, శృతిమించిన హీరోయిన్ల అందాలతో మాస్ ప్రేక్షకులకు విందు భోజనం అందించే సినిమాలా ఉంది. కథ గురించి ట్రైలర్లో దర్శకుడు పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చేశారు. అక్కడే ప్రేక్షకులకు దొరికేశారు కూడా. హీరో బ్రెయిన్లో పోలీసులు ఒక చిప్ పెడతారు. తరవాత ఏమైంది? అనేది కథ అని ట్రైలర్లో క్లుప్తంగా చెప్పారు. సేమ్ టు సేమ్ ఇటువంటి కాన్సెప్టుతో 2016లో 'క్రిమినల్' అని ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది. టాప్ స్టార్స్ ర్యాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్ నటించారు. ఆ సినిమా కాన్సెప్ట్ కాపీ చేసి పూరి 'ఇస్మార్ట్ శంకర్'గా తీసినట్టున్నారు. ఇస్మార్టుగా తెలంగాణ యాస, వారణాసి కనెక్ట్ ఇచ్చారు. జూలై 18న ఈ సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ 'ఇస్మార్ట్ శంకర్' పాటలపై సెటైర్స్ పడుతున్నాయి. కాపీ ట్యూన్లు అని. సినిమా కూడా కాపీ అయితే... పూరిని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకోవడం ఖాయం.