'RRR'కి రాజమౌళి షార్ట్ బ్రేక్
on Jul 4, 2019
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అమెరికా వెళ్లారు. అందువల్ల, ఆటోమేటిక్‌గా యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా ఆయన దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగుకు బ్రేక్ పడింది. అయితే... వారం రోజులు సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చామని తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ చేత ట్వీట్ చేయించారు. అమెరికా వెళ్లిన విషయాన్ని రాజమౌళి స్వయంగా ట్వీట్ చేశారు. తాను యుఎస్ వెళ్లాలని చెప్పడానికి కాదు. అమెరికాలో తెలుగు ప్రజలకు చిన్న క్లారిటీ ఇవ్వడానికి. త్వరలో అమెరికాలో జరగనున్న తానా సభల్లో రాజమౌళి పెద్దన్న ఎం.ఎం. కీరవాణి మ్యూజికల్ షో చేస్తున్నారు. దానికి రాజమౌళి కూడా హాజరవుతారని ప్రచారం మొదలైంది. దీనికి దర్శకధీరుడు ఫుల్ స్టాప్ పెట్టారు. "వ్యక్తిగత పనులపై వాషింగ్టన్ (అమెరికాలో నగరం) వచ్చాను. తానా సభల కోసం కాదు. పెద్దన్న మ్యూజికల్ షోకి హాజరు కాకపోవచ్చు. నేను అక్కడికి వస్తానని ఆశించొద్దు. డిజప్పాయింట్ కావొద్దు" అని రాజమౌళి ట్వీట్ చేశారు.