బెట్టింగ్ కేసులో మరో కోణం.. విజయ్ చేసింది తప్పా ఒప్పా..?
on Mar 20, 2025
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ విజయ్ దేవరకొండ సహా మొత్తం 25 మందిపై హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీని వల్ల విజయ్ చిక్కుల్లో పడతాడా? అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి విజయ్ టీమ్ నుంచి ధైర్యాన్ని నింపే వార్త వచ్చింది. (Vijay Deverakonda)
బెట్టింగ్ యాప్స్ కు విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే వార్తల నేపథ్యంలో ఆయన టీమ్ స్పందించింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ ప్రచారం నిర్వహించాడని, అవి చట్టప్రకారమే నిర్వహిస్తున్నారని టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా పరిమితమయ్యాడని పేర్కొంది.
ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదని టీమ్ తెలిపింది. అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశాడని, సుప్రీం కోర్టు సైతం రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు తెలియజేసిందని టీమ్ గుర్తు చేసింది. అలాగే ఏ 23 కంపెనీతో విజయ్ ఒప్పందం గతేడాది ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. విజయ్ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
