తన కట్ అవుట్ కాల్చిన వ్యక్తికి తన స్టైల్లో సన్మానం చేసిన మోహన్ బాబు
on Mar 20, 2025
తెలుగు సినిమా ఉన్నంత కాలం నటప్రపూర్ణ,కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు(MOhan Babu)నటప్రస్థానానికి ప్రత్యేక పేజీ ఉంటుంది.అంతలా తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతు వస్తున్న తన సినీ ప్రస్థానంలో ఆయన చూడని విజయం గాని,రికార్డు గాని లేదు.నిర్మాతగాను కొన్ని తరాల ప్రేక్షకులు మాట్లాడుకునే సినిమాలని నిర్మించాడు.ప్రస్తుతం తన కొడుకు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కన్నప్ప' కి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఒక కీలక పాత్ర కూడా పోషించాడు.
నిన్న మార్చి 19 న మోహన్ బాబు పుట్టిన రోజు.ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు తిరుపతి(tirupathi)లో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు మాటల్లో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అసెంబ్లీ రౌడీ మూవీ గురించి ప్రస్తావనకి వచ్చింది.ఆ చిత్రాన్నిఉద్దేశించి మోహన్ బాబు మాట్లాడుతు అసెంబ్లీ రౌడీని ఆపేయాలని అసెంబ్లీ లో గొడవ చేసారు.ఆ సమయంలో గుంటూరులో ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్ దగ్గర నాది 100 అడుగుల కట్ అవుట్ పెట్టారు. ఆ కట్ అవుట్ ని కాల్చింది అప్పట్లో యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న వెంకట్రావు.కానీ ఇప్పుడు నేను,వెంకట్రావు కుటుంబసభ్యుల్లా కలిసి ఉంటున్నామని చెప్పుకొచ్చారు.స్టేజ్ పైకి వెంకట్రావుని పిలిచి అందరకి పరిచయం చేసి సన్మానించడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ఈ స్పీచ్ వైరల్ గా మారడంతో మోహన్ బాబు మంచి మనసుకి ఇదే నిదర్శనం అంటు ఆయన అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వేడుకలకి తమిళ హీరో శరత్ కుమార్(Sarathkumar)తో పాటు ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలవబడే ప్రభుదేవా(Prabhudeva)ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఆధ్యంతం ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుగగా ప్రభుదేవా,మోహన్ బాబు చేసిన డాన్స్ ఆ ఈవెంట్ కి హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
