మాస్ బ్లాక్‌బస్టర్ కోసం బోయపాటితో 'సరైనోడు' చేసిన బన్నీ.. మళ్లీ కలుస్తారా?
on Aug 31, 2021

'స్టైలిష్ స్టార్'గా పేరుపడ్డ అల్లు అర్జున్, పక్కా నాటు మాస్ మసాలా సినిమాలు తీసే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే బోయపాటి వర్కింగ్ స్టయిల్‌కు బాలకృష్ణలాంటి మాస్ హీరోలైతేనే కరెక్ట్ అనేది సినీ వర్గాల అభిప్రాయం. అందుకే అర్జున్-బోయపాటి 'సరైనోడు' సినిమాని 'అన్‌యూజ్వల్ మూవీ'గా పేర్కొన్నారు. అయితే 'లెజెండ్' వంటి హిట్ సినిమా తర్వాత బోయపాటి తీసిన సినిమా కావడంతో సహజంగానే దీనిపై ఆసక్తీ, అంచనాలూ వ్యక్తమయ్యాయి.
మరోవైపు 'రేసుగుర్రం' వంటి కెరీర్ టాప్ ఫిల్మ్ తర్వాత చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం మాస్‌లో కంటే క్లాస్‌లోనే పేరు తెచ్చుకొని, బయ్యర్లకు లాభాల్ని అందించడంలో విఫలమవడంతో మాంచి మాస్ హిట్ కోసమే బోయపాటితో బన్నీ జతకట్టాడని ఇన్‌సైడర్స్ అన్నారు. కాకపోతే బన్నీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్‌తో పాటు క్లాస్‌నీ ఆకట్టుకునేలా మలిచేందుకు బోయపాటి కృషి చేశాడు. గీతా ఆర్ట్స్ బేనర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన 'సరైనోడు' మునుపటి బన్నీ సినిమాల బాక్సాఫీస్ రికార్డులను సవరించి, అప్పటికి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అంతటి బిగ్ హిట్ మూవీ తర్వాత మళ్లీ బన్నీ-బోయపాటి కలవకపోవడం ఆశ్చర్యకరమే. 'సరైనోడు' తర్వాత మెగా కాంపౌండ్‌లో రామ్‌చరణ్‌తో బోయపాటి చేసిన 'వినయ విధేయ రామ' ఫ్లాపవడమే కాకుండా, అందులో కొన్ని ఎపిసోడ్లను తీసిన విధానం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు తీసుకువచ్చింది. అందువల్లే మళ్లీ బోయపాటి వైపు బన్నీ చూడలేదని కూడా చెప్పుకుంటున్నారు. ఒకవేళ బాలయ్యతో బన్నీ తీస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'అఖండ' హిట్టయితే, మరోసారి బన్నీ-బోయపాటి కాంబినేషన్ కుదరవచ్చని కూడా టాక్ నడుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



