Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్ గా అల్లుఅర్జున్ చేసి ఉంటే.. ఇలాగే ఉండేది పరిస్థితి

Mar 25, 2026

 

 

-కలెక్షన్స్ తో అదరగొడుతున్న ధురంధర్ 2 
-ధురంధర్ గా అల్లు అర్జున్ చేసి ఉంటే ఎలా ఉండేది
-మెప్పించే వాడా!
-సోషల్ మీడియాలో పోలికలని తెస్తున్న ఫ్యాన్స్ 
-ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

 
'సిరివెన్నెల సీతారామశాస్త్రి'(Sirivennela sitaramasastriగారి మనోఫలకం నుంచి వచ్చే విధ్వంసం యొక్క సాహిత్యాన్ని 'ధురంధర్ 2'(Dhurandhar 2)బాగా ఒంటబట్టించుకున్నట్టుగా ఉంది. ఆల్ ఏరియాస్ లో సర్వే జనా ధురంధర్ బాట పట్టేలా చేస్తుంది. దీంతో దురంధర్ యొక్క కలెక్షన్స్ ల ప్రవాహ శైలి ఏ ఏరియాలో ఎన్ని వంపులు తిరుగుతుందో తెలియని పరిస్థితి. వారం కూడా నిండకుండానే వసూలు చేసిన 919 కోట్ల గ్రాస్ నే ఉదాహరణ. మరి అంతటి శక్తిని ప్రదర్శిస్తున్న ధురంధర్ 2  లో తమ అభిమాన హీరో చేసి ఉంటే బాగుండని అనుకోని అభిమాని ఉండడు కదా!. ఈ  కోవలోనే అల్లు అర్జున్  ధురంధర్ గా చేసి ఉంటే ఎలా ఉండేదనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. మరి ఆ చర్చకి ఆద్యులు అల్లు ఆర్మీనా మూవీ లవర్స్ నా అని తెలియదు. మరి ఆ చర్చల సారాంశం ఏమిటో చూద్దాం.

వాళ్లంతా మాట్లాడుతు ధురంధర్ సబ్జెట్ అల్లు అర్జున్(Allu Arjun)కి కూడా సూటవుతుంది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు గ్యాంగ్ స్టర్ గా చేయలేదు కాబట్టి ధురంధర్ క్యారక్టర్ సూటవుతుందా లేదా అని కొంత మంది అనుకోవచ్చు. పుష్ప సిరీస్ లో స్మగ్లర్ గా చేస్తున్నాడని గెటప్ రిలీజ్ చేసినప్పుడు కొంత మంది సంకోచించారు. జనరల్ ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందని ఫ్యాన్స్ సైతం భయపడ్డారు. కానీ పుష్ప సిరీస్ లో అల్లు అర్జున్ నుంచి వచ్చిన ఊచకోత పెర్ఫార్మ్ చూసి యావత్తు ఇండియా పుష్ప పెర్ఫార్మ్ కి సెల్యూట్ కొట్టింది. మరి ఈ లెక్కన ధురంధర్ లోని హంజా అలియాస్ జస్కి రాత్ సింగ్ గా అల్లుఅర్జున్ పర్ఫెక్ట్ గా సూటయ్యేవాడు. హిందీలో పుష్ప సిరీస్ ని అక్కడి ప్రేక్షకులు తమ చిత్రం లాగా భావించి బ్రహ్మ రధం పట్టారు కాబట్టి అల్లు అర్జున్ చేసి ఉంటే సౌత్ లో కూడా ధురంధర్ కలెక్షన్స్ ప్రభావం ఒక రేంజ్ లో ఉండేదని చెప్తున్నారు.

also read: Ram Charan: రామ్ చరణ్ గాయాలపై పవన్ కళ్యాణ్ వివరణ

అభిమానులు, మూవీ లవర్స్ ఆశలో ఎలాంటి కల్మషం ఉండదు కాబట్టి వాళ్ళు అలా అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ  ధురంధర్ 2 సౌత్ లో కూడా రికార్డు కలెక్షన్స్ సాధించే పనిలో బిజీగా ఉంది. రణవీర్ సింగ్ తో పాటి మిగతా నటీనటుల నాచురల్ పేర ఫార్మ్ కి, ఆదిత్య ధర్(Aditya Dhar)దర్శకత్వానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యి సలాం కొడుతున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com