Home

»

Latest News

Ram Charan: రామ్ చరణ్ గాయాలపై పవన్ కళ్యాణ్ వివరణ

Mar 25, 2026

 

-చరణ్ గాయాలపాలయినట్టుగా వస్తున్న న్యూస్ 
-నిజమేనా అంటు అభిమానుల ఆందోళన 
-ఇలాంటి టైంలో నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్  

'పెద్ది'(Peddi)షూటింగ్ లో మెగాపవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)గాయాలపాలైనట్టుగా మా 'తెలుగువన్' సైట్ లో ఎక్స్ క్లూజివ్ గా మీకు అందించిన  విషయం తెలిసిందే. దీంతో ఆ న్యూస్  నిజమేనా అంటు చాలా మంది కామెంట్స్ చేసుకొచ్చారు. కాకపోతే ఈ విషయంలో చరణ్ టీం గాని, పెద్ది మేకర్స్ గాని స్పందిస్తారేమో, ఆ న్యూస్ కూడా మీకు తెలియచేయాలని చూస్తున్నాం. కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అలాంటి టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చేసిన ఒక్క ట్వీట్ తో చరణ్ గాయాలు పాలయినట్టుగా ఫిక్స్ అవ్వచ్చు. 

ఎక్స్ క్లూజివ్ గా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు. సదరు ప్రెస్ నోట్ లో రామ్ చరణ్ 'పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపాడు. దీంతో చరణ్ గాయాలపాలైన విషయం నిజమైనట్లయింది. 


Also read: Cinema: సినిమా తీసాడు.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగిన నిర్మాత

 ఈ న్యూస్ ఉదయం నుంచే వినిపిస్తుండటంతో చరణ్ కి ఎలా ఉందనే టెన్షన్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రానికి గాయం విషయంపై చరణ్ అండ్ టీం స్పందించే అవకాశం ఉంది. కంటి దగ్గర చిన్న గాయమైందని, ఈ విషయంలో పెద్దగా భయపడాల్సిన పని లేదనే మాటలు వినపడుతున్నాయి. ఇక మార్చి 27 న చరణ్ పుట్టిన రోజుని గ్రాండ్ గా జరపడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఫిక్స్ అయ్యారు.సోషల్ మీడియాలో అయితే  ఇప్పట్నుంచే అభిమాన సందడి వాతావరణాన్ని తెప్పిస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com