స్పిరిట్ ఫస్ట్ లుక్.. అంచనాలను అందుకుందా?
on Jan 1, 2026

ప్రస్తుతం మోస్ట్ హైప్డ్ ఇండియన్ సినిమాలలో 'స్పిరిట్' ఒకటి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్ ఆ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. (Spirit First Look)
న్యూ ఇయర్ కానుకగా 'స్పిరిట్' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో షర్ట్ లేకుండా, ఒంటినిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్ పట్టుకొని ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రభాస్ ని సందీప్ చూపించే తీరుకి.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని అంటున్నారు.
అయితే 'స్పిరిట్' ఫస్ట్ లుక్ పై కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పోస్టర్ ఆర్టిఫిషియల్ గా ఉందని, కొత్తదనం లేదని, సందీప్ రెడ్డి గత చిత్రం యానిమల్ ని గుర్తు చేస్తుందని.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఒకట్రెండు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ.. మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం 'స్పిరిట్' ఫస్ట్ లుక్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



