పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్.. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్!
on Jan 1, 2026

2025లో 'ఓజీ'తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించారు. ఈ ఏడాది ఆయన 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అలరించనున్నారు. దీని తర్వాత పవన్ సినిమాలు కొనసాగిస్తారా? చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఆయన నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చేసింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, రాజకీయాలతో పాటు ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో మళ్ళీ కదలిక వచ్చిందని, పవన్ మిలిటర్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని రెండు నెలల క్రితం తెలుగువన్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇచ్చింది. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి కీలక ప్రకటన చేశారు.
పవర్ స్టార్ ఆశీస్సులతో 'జైత్ర రామ మూవీస్' బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు రామ్ తాళ్లూరి అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో చేతులు కలిపినట్లు తెలిపారు.
పవన్ ఇటీవల షార్ట్ హెయిర్, ఆర్మీ ప్యాంటు ధరించి కొత్త లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. రామ్ తాళ్లూరి ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
2025 నవంబర్ లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇచ్చిన తెలుగువన్.
-- మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



