బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో అద్భుతం.. బాబా విగ్రహం నుంచి విబూది!
on Aug 31, 2021
నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో ఓ అద్భుతం జరిగిందట. హిమజ ఇంట్లో ఉన్న సాయిబాబా విగ్రహం నుంచి విబూది రాలిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది.
తమ కుటుంబమంతా సాయిబాబా భక్తులమని, ఎప్పటి నుంచో తమ ఇంట్లో ఆయన విగ్రహం ఉందని తెలిపింది. 2004లో తమకు రమణానంద స్వామీజీ పరిచయం అయ్యారని, అప్పుడు బాబాకి 19 రోజులు హోమం చేశామని పేర్కొంది. ఆ సమయంలో బాబా విగ్రహం తుడవడం, ముందున్న నీళ్ళని మార్చటం తన డ్యూటీ అయిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఒకసారి బాబా విగ్రహం క్లిన్ చేయడానికి వెళ్ళినప్పుడు విగ్రహం చుట్టూ విబూది ఉందని తెలిపింది. అంతేకాకుండా విగ్రహం శుద్ధి కోసం ఉంచిన నీళ్ళు తులసి నీరుగా మారిపోయి ఘాటైన తులసి వాసన వచ్చాయని పేర్కొంది. ఇటువంటి అద్భుతాన్ని తన జీవితంలో చూడలేదని.. తానూ ఎవ్వర్నీ నమ్మించడానికి ఈ విషయం చెప్పటం లేదని.. తన అనుభూతిని చెప్పుకోడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానని హిమజ చెప్పుకొచ్చింది.
వినాయకుడి విగ్రహం పాలు తాగింది, బాబా విగ్రహం నుంచి విభూది వచ్చింది, అమ్మవారి విగ్రహం కళ్ళ నుంచి రక్తం వచ్చింది వంటి వార్తలు అప్పట్లో తరచుగా వినిపించేవి. ఇప్పుడు హిమజ కూడా తమ ఇంట్లో ఓ అద్భుతం జరిగిందంటూ బాబా విగ్రహం నుంచి విబూది రాలిందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఇదంతా సాయి లీల అంటుండగా.. కొందరు మాత్రం అదంతా ఏముండదని కొట్టి పారేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
