సీటీమార్ ట్రైలర్.. గోపీచంద్ యాక్షన్, తమన్నా గ్లామర్
on Aug 31, 2021

గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీటీమార్'. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోన్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా 'సీటీమార్' మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్సా.. నీకు రూల్స్ తెలుసు కదా' అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. డానికి కౌంటర్ గా 'రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు.. రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు' అంటూ గోపీచంద్ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పారు. యాక్షన్, ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గోపీచంద్ యాక్షన్, తమన్నా గ్లామర్, మ్యూజిక్ ఈ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సినిమాలో రావు రమేష్, భూమిక, తరుణ్ అరోరా తదితరులు నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కి సీటీమార్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



