అభిమాని మృతి.. అతని కుటుంబానికి అండగా సూర్య!
on Sep 28, 2023
హీరోలకు, అభిమానులకు మధ్య మంచి అనుబంధం, స్నేహ బంధం ఉంటుంది. అయితే అది కొందరు హీరోలకే వర్తిస్తుంది. అభిమానుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకుగానీ, విషాద ఘటనలకుగానీ హాజరై తమ అభిమానులకు అండగా ఉండే హీరోల్లో సూర్య ఒకరు. ఇటీవల తన అభిమాని ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న సూర్య ఆ అభిమాని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
చెన్నయ్‌లోని ఎన్నూర్ వాసి అయిన అరవింద్ హీరో సూర్యకు వీరాభిమాని. ఇటీవల అరవింద్ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంటనే ఆ అభిమాని ఇంటికి వెళ్ళిన సూర్య అతని తల్లిదండ్రులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఆయా కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది 10 భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



