Home

»

Latest News

హన్సిక ప్రైవేట్ వీడియో లీక్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ క్లిప్స్.!

Oct 30, 2026 11:32AM

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ వీడియోలు వైరల్ కావడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోయిన్లను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. తాజాగా నటి హన్సిక పేరు కూడా ఇలాంటి వివాదంలో వినిపిస్తోంది. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి.

తమిళం, తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వెకేషన్ అప్‌డేట్స్‌తో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయిందంటూ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఎక్స్, రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ అంశంపై చర్చ మొదలైంది.

అయితే వైరల్ అవుతున్న వీడియో నిజంగా హన్సికదేనా? అనే ప్రశ్నకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఆ వీడియోలో ఉన్నది హన్సిక కాదని, ఆమెను పోలి ఉన్న మరో వ్యక్తి వీడియోను ఆమె పేరుతో ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. మరికొందరేమో అది ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అంటున్నారు.

ఇదిలా ఉంటే, గతంలోనూ పలువురు నటీమణుల పేర్లతో ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో హన్సిక పేరును ఉపయోగిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. త్రివిక్రమ్ అనుకున్నట్టే చేశాడు.!

 

 

 

[Hansika Video Leak Rumours, Hansika Motwani Video Leak, Hansika Private Video, Hansika Viral Video, Hansika Fake Video, Hansika Deepfake Video, Hansika AI Video, Hansika Motwani]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com