
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (AK47) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సోషల్ మీడియాలో మంచి స్పందనే లభిస్తోంది. వెంకటేశ్ కామెడీ టైమింగ్, సత్య నటన, ఫస్టాఫ్‌లోని సన్నివేశాలకు ప్రశంసలు దక్కుతుండగా.. సెకండాఫ్ నెమ్మదించడం, కథనంలో పట్టు తగ్గడం వంటి అంశాలపై కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో వచ్చే హాస్య సన్నివేశాలు, కొన్ని కీలకమైన డైలాగులు బాగా పేలాయని అభిప్రాయపడుతున్నారు. కమెడియన్ సత్య పోషించిన ఐటీ ఉద్యోగి పాత్ర కూడా నవ్వులు పూయించిందని ప్రశంసిస్తున్నారు.
విలన్ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కొందరు ప్రేక్షకులు పేర్కొంటున్నారు. రావు రమేశ్, రఘుబాబు తమ పాత్రలతో వినోదాన్ని అందించారని అంటున్నారు. తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలాన్నిచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సినిమా ఫస్ట్ సరదాగా సాగడంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయని చెబుతున్నారు.
అయితే, ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త డల్ అయిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంటర్వెల్ దగ్గర ఆసక్తిని పెంచిన కథనం ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదని, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్లు, కథలో భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో పండకపోవడం సినిమాకు కాస్త మైనస్‌గా మారాయని అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే ‘ఆదర్శ కుటుంబం’కు సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించిందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సంగీత ప్రపంచంలో విషాదం.. ఇళయరాజా ఆస్థాన గిటారిస్ట్ కన్నుమూత.!
[Aadarsha Kutumbam Twitter Review, Aadarsha Kutumbam Review, Aadarsha Kutumbam Public Talk, AK47 Movie Review, Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, AK47 Movie]




