హన్సిక 'ఐలవ్యూ' అబద్ధమే!
on May 12, 2020

ప్రేమించిన వ్యక్తులకు 'ఐ లవ్యూ' చెబుతాం! అమ్మ, నాన్న, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, బాబాయ్, పిన్ని... ఎవరికైనా కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు. ప్రేమను వ్యక్తం చేయడానికి 'ఐ లవ్యూ' చెప్పడం అలవాటు. అందులో ఒక నిజాయతీ ఉంటుంది. హన్సిక 'ఐ లవ్యూ' చెప్తే మాత్రం తప్పకుండా అనుమానించాల్సిందే. ఆమె చెప్తే... అందులో నిజాయితీ ఉందో లేదో ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే? తన మనసులో ప్రేమ లేకపోయినా చాలా సార్లు ఐ లవ్యూ చెప్పానని తాజాగా హన్సిక తెలిపారు. అదీ సంగతి!
ఐ లవ్యూ విషయంలోనే కాదు... సాధారణంగా హన్సిక అబద్ధాలు ఆడతానని హన్సిక ఒప్పుకున్నారు. స్నేహితులతో చాలాసార్లు అబద్ధాలు చెప్పానని ఆమె అన్నారు. అయితే... ఫ్రెండ్ కి అబద్ధం చెప్పాననేది అడగవద్దని అన్నారు.
బోర్ కొట్టడంతో కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వాళ్ళ ఫోన్ చూసే అలవాటు తనకు లేదని, కాని తన సోదరుడు మాత్రం తరచు ఆ పని చేస్తుంటాడని హన్సిక బయటపెట్టారు.
ఇప్పటివరకు తనను ఏ సినిమా నుంచి తీసేయలేదని హన్సిక తెలిపారు. తనకు ఇష్టం లేని కారణంగా కొన్ని సినిమాల నుండి తప్పుకుంటానని ఆమె వివరించారు. ప్రస్తుతం ముంబైలో తల్లితో కలిసి ఉంటున్నానని, లాక్ డౌన్ కారణంగా ఎక్కడికి వెళ్లడం లేదు అని హన్సిక చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



