మోసం చేసిన రామ్‌చరణ్..సరిదిద్దిన చిరంజీవి
on Feb 27, 2017

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎన్నోసార్లు చూశాం. ఎన్టీఆర్, మహేశ్, సునీల్, రవితేజ ఇలా తమ గొంతును వేరే వారి కోసం అరువిచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన మంచు మనోజ్ నటించిన గుంటూరోడు సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో ఈ మూవీపై భారీ హైప్ వచ్చింది. అయితే ఫస్ట్ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్..
యూనిట్ కూడా ముందుగా రామ్‌చరణ్‌ని సంప్రదించడం చెర్రీ ఓకే అనేయడం అంతా క్షణాల్లో జరిగింది. తీరా చివరి నిమిషంలో చెర్రీ హ్యాండ్ ఇచ్చేశాడట..ఆ సమయంలో చరణ్ హైదరాబాద్‌లో లేడు..ఇక్కడేమో వాయిస్ అర్జంట్..తాను రావడానికి లేటవుతుందని చరణ్ చెప్పడాట..ఏం చేయాలో పాలుపోని యూనిట్ సభ్యులు మెగాస్టార్‌ను సంప్రదించడంతో ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట.. ఇంతా జరిగినా ఈ విషయం మనోజ్‌కి తెలియదట..వాయిస్ ఇచ్చేసి ఎలా ఉందో చూడమని చిరు మనోజ్‌కి కాల్‌చేశారట. సో కొడుకు మాటని తండ్రి నెరవేర్చాడన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



