నాగ్‌కి ఏమైంది..ఎంతకీ నోరు మెదపరే..?
on Feb 27, 2017

టాలీవుడ్ సెలబ్రిటీల్లో నాగార్జునది డిఫరెంట్ స్టైల్..సహజంగా సినీతారల వ్యక్తిగత విషయాలపై మీడియాలో రకరకాల గాసిప్స్ హల్‌చల్ చేస్తుంటాయి. కొంతమంది తారలు వాటిని పట్టించుకుంటారు..మరి కొంతమంది మాత్రం ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే ఏందుకు వద్దనుకోవాలి అనుకుంటారు..కాని నాగ్ మాత్రం మొదట చెప్పిన దానిని పక్కాగా ఫాలో అవుతారు. తనపైనా..తన కుటుంబంపైనా ఏ చిన్న రూమర్ వచ్చినా వెంటనే దానిని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చేస్తుంటారు నాగ్.
దిల్‌రాజ్ బ్యానర్‌లో సినిమా అయినా..సమంతా-నాగచైతన్య ప్రేమించుకుంటున్నారన్న విషయంలోనైనా క్లియర్‌గా క్లారిటీ ఇచ్చేశారు..అలాంటి కింగ్ అఖిల్-శ్రేయా పెళ్లి విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు..రోజులు గడుస్తున్నా, ఎన్నో కథనాలు సునామీలా మీద పడుతున్నా నాగ్ మౌనం వీడటం లేదు. అయితే అందుకు కారణం లేకపోలేదు..మనుషులు, మనసులు మారడానికి ఒక్క నిమిషం చాలని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే తొందరపడి ప్రెస్ మీట్లు పెట్టేయకుండా కొద్ది రోజులు వెయిట్ చేయాలని నాగ్ డిసైడయ్యారని ఫిలింనగర్ వర్గాల టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



