నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ కానున్న జాన్వీ కపూర్ మూవీ
on May 12, 2020
రెండు నెలలుగా దేశంలోని సినిమా హాళ్లన్నీ కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డాయి. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ ఉధృతం అవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ మరింత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినా.. సినిమా హాళ్లు వెంటనే తెరుచుకొనేటట్లు కనిపించడం లేదు. ఇది సినిమా ఇండస్ట్రీపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీకి వేలాది కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ తరుణంలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టైటిల్ రోల్ చేసిన 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్' మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయడానికి ఆ చిత్ర నిర్మాత సంక్పలించారు. థియేటర్లలో విడుదల చేయాలని కూర్చుంటే ఎప్పటికి అవుతుందో తెలీని అనిశ్చిత స్థితి ఉన్నందున ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు ఆయన తన చిత్రాన్ని అమ్మేశారు. నిజానికి ఈ సినిమాని నిర్మించింది జీ స్టూడియోస్. తనకు సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్నప్పటికీ 'గుంజన్ సక్సేనా' మూవీతో పాటు ఇషాన్ ఖట్టర్ - అనన్యా పాండే జోడీగా నటించిన 'ఖాలీ పీలీ' మూవీని కూడా నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ రిలీజ్‌కు ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
భారతదేశపు తొలి మహిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా పేరు పొందడమే కాకుండా, కార్గిల్ వార్‌లో పాల్గొన్న ధీమంతురాలిగా కూడా గుంజన్ సక్సేనా పేరు పొందారు. ఆమె పాత్రను జాన్వీ పోషించింది. శరణ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీని వాస్తవానికి మొదట మార్చి 13న, ఆ తర్వాత ఏప్రిల్ 24 విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా క్రైసిస్‌తో వాయిదా పడి, ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
