ఓటీటీలో అలియా `గంగూబాయి`?
on Apr 20, 2021
ఓటీటీ ట్రెండ్ ఊపందుకున్నాక గత ఏడాది కాలంగా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ నే హవా చాటాయి. దక్షిణాదిన `పెంగ్విన్`, `మిస్ ఇండియా`, `నిశ్శబ్దం`, `అమ్మోరు తల్లి`, `పరమపదమ్ విలయాట్టు`.. ఇలా పలు అగ్ర తారల చిత్రాలు ఓటీటీ వేదికగా సందడి చేస్తే.. ఉత్తరాదిన `శకుంతలా దేవి`, `గుంజన్ సక్సేనా`తో సహా అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ స్ట్రీమ్ అయ్యాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే వరుసలో ఓ భారీ బడ్జెట్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఓటీటీ బాట పట్టనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టైటిల్ రోల్ లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన చిత్రం `గంగూబాయి కతియావాడి`. ఈ సినిమాని జూలై 30న థియేటర్స్ లో రిలీజ్ చేయాలని సంజయ్ అండ్ టీమ్ ప్లాన్ చేసింది. అంతేకాదు.. ప్రాంతీయ భాషల్లోనూ అనువాద రూపంలో విడుదల చేయాలని ప్రచార చిత్రాలతోనూ పలకరించారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసే దిశగా చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Also Read