'గాండీవధారి అర్జున' నుంచి రొమాంటిక్ మెలోడీ.. వరుణ్, సాక్షి కెమిస్ట్రీ హైలైట్!
on Jul 31, 2023

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' అంటూ కొత్త చిత్రంతో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వరుణ్ కి జంటగా 'ఏజెంట్' భామ సాక్షి వైద్య దర్శనమివ్వనుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ చిత్రం నుంచి "నీ జతై సాగింది పాదమే.. ఆపినా ఆగునా లోలోని వేగమే..." అంటూ సాగే పాటని విడుదల చేశారు. వరుణ్ తేజ్, సాక్షి వైద్యపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ కి రెహమాన్ సాహిత్యమందించగా.. ఎల్వ్య, నకుల్ అభ్యంకర్ గానం చేశారు. లిరిక్స్, మ్యూజిక్, పిక్చరైజేషన్.. ఇలా అన్ని విధాలుగా ఈ మెలోడీ ప్లజెంట్ గా సాగింది. మరీముఖ్యంగా.. వరుణ్, సాక్షి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. మరి.. పాటతో ఇంప్రెస్ చేసిన యూనిట్.. సినిమాతోనూ ఆకట్టుకుందేమో చూడాలి. కాగా, ఆగస్టు 25న 'గాండీవధారి అర్జున' జనం ముందుకు రాబోతోంది. వరుణ్ గత చిత్రాలు 'గని', 'ఎఫ్ 3' ఆశించిన స్థాయి విజయాలు సాధించకపోవడంతో.. 'గాండీవధారి అర్జున' ఫలితం కీలకంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



