తెలుగులో మరో మలయాళం రీమేక్
on Jul 31, 2023

ఈ ఓటీటీ యుగంలో ఇతర భాషల సినిమాలను కూడా ఇంట్లోనే ఉండి చూసే అవకాశముంది. అయినప్పటికీ కొందరు రీమేక్ సినిమాలు చేయడంలో వెనకడుగు వేయడంలేదు. ముఖ్యంగా మలయాళం సినిమాలను రీమేక్ చేయడానికి టాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళ మూవీ తెలుగులో రీమేక్ అవుతోంది.
2021లో మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ సినిమా 'నాయట్టు'. జోజు జార్జ్, కుంచాకో బోబన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించాడు. మామూలుగా హత్య కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలాంటిది పోలీసులే హత్య కేసులో ఇరుక్కొని, పరారైతే ఎలా ఉంటుందనే ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రాజకీయ నేపథ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్ తెలుగులో రీమేక్ చేస్తోంది. శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'కోటబొమ్మాళి PS' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 'జోహార్' ఫేమ్ తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ రీమేక్ ఏస్థాయిలో అలరిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



