గేమ్ చేంజర్ టికెట్ రేట్స్ పెంపుకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..రేట్స్ ఇవే
on Jan 8, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,శంకర్,కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ .సంక్రాంతి కానుకగా ఈనెల 10 న విడుదల కాబోతుండగా రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ,అంజలి హీరోయిన్లుగా నటించారు. చరణ్ కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత.పైగా దిల్ రాజు కి 50 వ చిత్రం కూడాను.దీంతో ఎంటైర్ తన కెరిరీలోనే ఫస్ట్ టైం మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో నిర్మించాడు.ఇప్పుడు ఈ మూవీ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.కాకపోతే అర్థ రాత్రి బెనిఫిట్ షో కి మాత్రం అనుమతి ఇవ్వలేదు.పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు అనుమతి.మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150రూపాయలు పెంపు.సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు.జనవరి 11 నుంచి మాత్రం 5 షోస్ కు అనుమతి.అదే విధంగా మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకు అనుమతి.సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు ఉండేలా ప్రత్యేక జీవో జారీ చేసింది.
ఇక ఈ మూవీకి ఇప్పటికే టికెట్ రేట్స్ పెంపుకి అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక జీవో జారీచేసిన విషయం తెలిసిందే.కాకపోతే కోర్టు ఉత్తర్వులు ప్రకారం మొదటి పది రోజులు మాత్రమే ధరల ప్రకారం టికెట్ రేట్స్ ఉంటాయి.బెనిఫిట్ షో యధావిధిగా ఒంటి గంటకి ఉండనుంది.
Also Read