'గేమ్ చేంజర్' ఫస్ట్ లుక్.. చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్
on Mar 27, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
నేడు(మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'గేమ్ చేంజర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ లో బైక్ మీద కూర్చొని ఉన్న చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ తో చరణ్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్ కావడంతో.. పొలిటికల్ టచ్ ఉండేలా ఫస్ట్ లుక్ ని రూపొందిస్తారని భావింతారంతా. కానీ దర్శకుడు శంకర్ మాత్రం అల్ట్రా స్టైలిష్ పోస్టర్ తో అందరిని సర్ ప్రైజ్ చేశారు. ఈ మూవీ టైటిల్ విషయంలో కూడా ఇలాగే చేశారు. 'సీఈఓ', 'సర్కారోడు' వంటి టైటిల్స్ ని పరిశీలించి అనూహ్యంగా 'గేమ్ చేంజర్'ని అనౌన్స్ చేశారు. మొత్తానికి డైరెక్టర్ శంకర్ తన మార్క్ స్ట్రాటజీలతో అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నారు.
Also Read