Home

»

Latest News

ర‌వితేజకి చుక్క‌లు చూపిస్తున్న ఫిబ్ర‌వ‌రి!

Feb 14, 2022 9:43AM

చిత్ర పరిశ్ర‌మ‌లో ఒక్కోసారి సెంటిమెంట్స్ బాగా హైలైట్ అవుతుంటాయి. మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఇలాంటి సెంటిమెంట్స్ కి అతీతుడు కాదు. అదేమి చిత్ర‌మో కానీ.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో ర‌వితేజ హీరోగా వ‌చ్చే సినిమాల‌న్నీ బాక్సాఫీస్ రిజ‌ల్ట్స్ ప‌రంగా చుక్కలు చూపిస్తున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. స‌రిగ్గా 16 ఏళ్ళ క్రితం `షాక్` (2006) చిత్రంతో  క‌థానాయ‌కుడి హోదాలో ఫిబ్ర‌వ‌రిలో తొలిసారిగా సంద‌డి చేశాడు ర‌వితేజ‌. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ సినిమా.. టైటిల్ కి త‌గ్గ‌ట్టే షాక్ ఇచ్చింది. ఆపై ఆరేళ్ళ త‌రువాత `నిప్పు` (2012)తో చాన్నాళ్ళకి ఫిబ్ర‌వ‌రిలో జ‌నం ముందు నిలిచాడు మాస్ మ‌హారాజా. గుణశేఖ‌ర్ రూపొందించిన ఈ సినిమా కూడా డిజప్పాయింట్ చేసింది. ఆన‌క మ‌ళ్ళీ ఆరేళ్ళ అనంత‌రం `ట‌చ్ చేసి చూడు` (2018)తో ఇంకోసారి ఫిబ్ర‌వ‌రిలో సిల్వ‌ర్ స్క్రీన్ పైకి వ‌చ్చాడు ర‌వితేజ‌. నూత‌న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ తెర‌కెక్కించిన ఈ మూవీ కూడా నిరాశ‌ప‌రిచింది.

Also Read: 13 ఏళ్ల త‌ర్వాత ఫ్యామిలీతో విహార‌యాత్ర‌కు..!

క‌ట్ చేస్తే.. నాలుగేళ్ళ త‌రువాత మ‌ర‌ల ఇప్పుడు `ఖిలాడి`గా అదే ఫిబ్ర‌వ‌రిలో వ‌స్తే.. నెగ‌టివ్ టాక్ తో పాటు వ‌సూళ్ళు కూడా అంత ఇంప్రెసివ్ గా లేవు. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో ర‌వితేజ ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేర‌డం ఖాయ‌మంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. మొత్తానికి `క్రాక్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చిన ర‌వితేజ‌కి.. `ఖిలాడి` రూపంలో మ‌ళ్ళీ అప‌జ‌యం ఎదురైంద‌నే చెప్పాలి. ఏదేమైనా.. ర‌వితేజ‌కి ఫిబ్ర‌వ‌రి నెల అంత‌గా క‌లిసి రావ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టం. మ‌రి.. భ‌విష్య‌త్ లోనైనా ఈ నెగ‌టివ్ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందేమో చూడాలి. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com