Home

»

Latest News

13 ఏళ్ల త‌ర్వాత ఫ్యామిలీతో విహార‌యాత్ర‌కు..!

Feb 11, 2022 5:03PM

 

ఫ్యామిలీతో క‌లిసి 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత తొలిసారి విహార‌యాత్ర‌కు వెళ్లాన‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. ఇటీవ‌లే మాల్దీవుల్లో గ‌డిపి వ‌చ్చిన ఆమె, ఇప్పుడు మ‌రోసారి త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి అక్క‌డ‌కు విహార‌యాత్ర నిమిత్తం వెళ్లింది. అమ్మానాన్న‌లు, సోద‌రునితో క‌లిసున్న ఓ ఫొటోను షేర్ చేసిన పూజ‌, "ఎట్ట‌కేల‌కు! ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత మా తొలి కుటుంబ విహార‌యాత్ర‌. చాలా కాలంగా అనుకుంటున్న‌దీ, అత్యంత అవ‌స‌ర‌మైన‌దీ" అని రాసుకొచ్చింది. Also read: `వాల్తేర్ మొన‌గాడు`గా మెగాస్టార్!?

ఇన్‌స్టా స్టోరీస్‌లో, మాల్దీవుల్లో త‌మ కుటుంబం స‌ర‌దాగా గడుపుతున్న ఫొటోల‌ను, వీడియోల‌ను షేర్ చేసింది పూజ‌. ఈసారి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, ఈ ట్రిప్‌లో వాళ్ల‌మ్మ బ‌ర్త్‌డే రావ‌డం. అమ్మ బ‌ర్త్‌డేని కేకుల‌తో అందంగా సెల‌బ్రేట్ చేసిందామె. Also read: మంచు ఫ్యామిలీతో పేర్ని నాని భేటీ.. మోహన్ బాబే అసలైన పెదరాయుడు!

ప‌ని విష‌యానికి వ‌స్తే, ఆమె రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన 'ఆచార్య' మూవీ, విజ‌య్ జోడీగా న‌టించిన 'బీస్ట్' త‌మిళ ఫిల్మ్ విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. త్వ‌ర‌లో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టిస్తోన్న 'భాయీజాన్' మూవీ సెట్స్ మీద‌కు వెళ్తోంది. ఇవి కాక త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో మూడోసారి, మ‌హేశ్ స‌ర‌స‌న రెండోసారి న‌టించేందుకు రెడీ అవుతోంది పూజ‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com