అంతా నకిలీనే నమ్మకండి.. అభిమానులకి షాక్ ఇచ్చిన శ్రియా
on Nov 19, 2025

-అభిమానులకి షాక్
-ఎందుకు ఇదంతా చేస్తున్నారు
-శ్రీయ నట ప్రస్థానానికి తిరుగు లేదు
-వాట్స్ అప్ నెంబర్ ఎవరిది
శ్రియా(Shriya Saran)నటప్రస్థానానికి ఉన్న జర్నీ ఇప్పటి వరకు రెండున్నర దశాబ్దాలు. ఈ ప్రస్థానం మరిన్ని దశాబ్దాలు కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతడులో మహేష్ బాబు(Mahesh Babu)ని ఉద్దేశించి తనికెళ్ళ భరణి ఒక డైలాగ్ చెప్తాడు. ఎవరైనా బలంగా కొడతారు, కోపంగా కొడతారు. కానీ వీడేంటి చాలా శ్రద్దగా కొట్టాడని అంటాడు.ఆ డైలాగ్ కి తగ్గట్టే శ్రీయ తాను చేస్తున్న క్యారక్టర్ ని ఎక్కడ ఓవర్ డోస్ లేకుండా, కంగారుగా చెయ్యకుండా చాలా శ్రద్దగా చేస్తుంది. ఇందుకు ఆమె సినీ జర్నీలో ఇప్పటి వరకు పోషించిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి క్యారెక్టర్స్ నే ఉదాహరణ. ఈ ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన 'మిరాయ్'(Mirai)లోని అంబికా ప్రజాపతి క్యారక్టర్ కూడా ఒక ఉదాహరణ. సోషల్ మీడియాలో ప్రస్తుతం శ్రియా వాట్స్ అప్ నెంబర్ ఇదేనంటూ ప్రచారం జరుగుతుంది. సదరు నెంబర్ వాట్స్ అప్ డిపి గా శ్రియా ఫోటో ఉండటంతో పాటు చాలా మందికి మెసేజెస్ వెళ్తున్నాయి.
ఈ విషయంపై శ్రియా ఇనిస్టాగ్రమ్ వేదికగా స్పందిస్తు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాట్సప్ నెంబర్ నాది కాదు. సదరు నెంబర్ ఎవరిదో కూడా నాకు తెలియదు. నా పేరుతో ఇతరుల దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలని చూస్తున్నారు. దయచేసి ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండండి. దురదృష్టం ఏంటంటే ఆ నకిలీ వ్యక్తి నా ఫ్యామిలీ సభ్యులతో పాటు నేను పని చేయనున్నవారికి సందేశాలు పంపుతున్నాడు. అతడితో జాగ్రత్త. ఇలాంటివి జరిగినప్పుడు బాధగా ఉంటుందని శ్రియ తెలిపింది. రీసెంట్ గా మరో హీరోయిన్ 'అదితిరావు హైదరీ'(Aditi Rao Hydari)ఇదే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఎవరు మోసపోవద్దని చెప్పుకొచ్చింది.
also read: డిసెంబర్ లో ఎన్టీఆర్ శ్రీలంక పయనం! కారణం ఇదేనా!
కెరీర్ పరంగా చూసుకుంటేశ్రియా 'నాన్ వైలెన్స్' అనే తమిళ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



