డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎన్టీఆర్ శ్రీలంక పయనం! కారణం ఇదేనా!
on Nov 19, 2025

-ఎన్టీఆర్ నుంచి వస్తున్న కొత్త న్యూస్ ఏంటి!
-ఫ్యాన్స్ కోరిక నెరవేరిందా!
-డ్రాగన్ ఓకే నా!
-శ్రీలంక ఎవరెవరు వెళ్తారు
పాన్ ఇండియా ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్స్ కూడా కొన్ని సినిమాల రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటాయి. అలాంటి ఒక చిత్రమే మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)కలయికలో రూపొందుతున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్. చిత్ర బృందం అధికారకంగా ప్రకటించకపోయినా'డ్రాగన్'(Dragon)అనే పేరు ప్రచారంలో ఉంది. ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా డ్రాగన్ టైటిల్ బాగుందని అదే పేరుని కంటిన్యూ చెయ్యమని సోషల్ మీడియా వేదికగా కోరుతు వస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ గత కొన్ని రోజులుగా చిత్ర బృందం వెల్లడి చెయ్యడం లేదు. దీంతో మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెర్చ్ చేస్తున్నారు..ఈ క్రమంలోనే ఒక న్యూస్ వాళ్ళ కంట పడింది.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad)లో షూటింగ్ ప్రారంభమైందని,ఈ నెల చివరకి సదరు షెడ్యూల్ పూర్తి అవుతుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంక(Srilanka)లో ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ తో పాటు మిగతా నటీనటులుపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ న్యూస్ లో నిజమెంత ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ లో మాత్రం జోష్ ని నింపుతుంది. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో హీరో తన మాస్ విశ్వరూపాన్ని చూపించడంలో ఏ మాత్రం వెనుకాడడు. మరి మాస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. చిత్ర కథపై కూడా అందరిలో క్యూరియాసిటీ నెలకొని ఉంది.
also Read: ఐదు నెలల సమయం మాత్రమే!.. జై హనుమాన్ కీలక అప్ డేట్ ఇదేనా!
ఈ ప్రాజెక్ట్ కి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్సుర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఎన్టీఆర్ తో కాంతార చాప్టర్ 1 ఫేమ్ 'రుక్మిణి వసంత్'( జత కడుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. జూన్ 25 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ ఎంట్రీ ని దక్కించుకోనుంది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



