కమల్‌కి విలన్‌గా ఫాహద్ ఫాజిల్?
on Dec 8, 2020
లోక నాయకుడు కమల్ హాసన్, ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం విక్రమ్. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్.. సినిమాపై ఎనలేని ఆసక్తిని రేకెత్తించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని దాదాపుగా నైట్ షూట్స్ లోనే ప్లాన్ చేశారట లోకేష్. అంతేకాదు.. వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించబోతున్నట్లు కోలీవుడ్ బజ్. ఇందులో ఫాహద్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. త్వరలోనే విక్రమ్ లో ఫాహద్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, తమిళ సినిమాల్లో నటించడం ఫాహద్ కి ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే శివకార్తికేయన్ వేలైక్కారన్, విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్ చిత్రాలతో తమిళులను అలరించారాయన. మరి.. కమల్ లాంటి సీనియర్ హీరోతో ఢీ కొంటున్న వైనం ఫాహద్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read