చిరు ట్వీట్.. మా చిన్నారి నిహారికను చైతన్య చేతిలో పెడుతున్నా...
on Dec 8, 2020
నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి రేపు బుధవారం చైతన్య జొన్నలగడ్డతో జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం వివాహ వేడుక జరగనున్న ఉదయ్‌పూర్‌లో మకాం పెట్టింది. సోమవారం రాత్రి సందడిగా జరిగిన సంగీత్ వేడుకలో వధూవరులిద్దరూ మెగాస్టార్ చిరంజీవి సినిమా పాటలకు డాన్స్ చేస్తారు. నిహారికతో పోటీపడి చైతన్య కూడా చక్కగా స్టెప్పులేశాడు.
కాగా చిరంజీవికి తన కుమార్తెలు సుస్మిత, శ్రీజ అంటే ఎంత ప్రేమో నిహారిక అన్నా అంత ప్రేమ. ఇప్పటికీ నిహారికను ఆయన ముద్దు చేస్తూనే ఉంటారు. ఆయనకు నిహారిక వీరాభిమాని మాత్రమే కాదు, విపరీతమైన అనురాగం. ఆయనతో తన చిన్ననాటి పిక్చర్లను కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె షేర్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నిహారిక పెళ్లవుతుండటంతో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.
లేటెస్ట్‌గా నిహారిక ప్రి వెడ్డింగ్ సెర్మనీలో తీసుకున్న సెల్ఫీ పిక్చర్‌తో పాటు చిన్నారి నిహారికను ఎత్తుకొని ఉన్న పిక్చర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆయన, "మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు. God bless you!" అంటూ ట్వీట్ చేశారు.