Home

»

Latest News

ప‌వ‌న్ తోనైనా ట్రాక్ మారేనా!

Jan 28, 2022 4:01PM

వైవిధ్యానికి పెద్ద‌పీట వేసే ద‌ర్శ‌కుల్లో క్రిష్ ఒక‌రు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా తెలుగునాట త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకున్నారీ అగ్ర ద‌ర్శ‌కుడు.

ఇదిలా ఉంటే.. ఐదేళ్ళ క్రితం విడుద‌లైన `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` త‌రువాత టాలీవుడ్ లో మ‌ళ్ళీ మ‌రో స‌క్సెస్ ఫుల్ మూవీని త‌న ఖాతాలో వేసుకోలేక‌పోతున్నారు క్రిష్. ఈ నేప‌థ్యంలో.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో తీస్తున్న పిరియ‌డ్ డ్రామా `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`పైనే ఆశ‌లు పెట్టుకున్నారాయ‌న‌. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లోనే తెర‌పైకి రానుంది.

Also Read: చిరంజీవి ప్లేస్ లో రామ్ చరణ్!

కాగా, మెగా కాంపౌండ్ లో క్రిష్ కి ఇది నాలుగో సినిమా. గ‌తంలో ఆయ‌న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో `వేదం`, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో `కంచె`, మెగా యంగ్ సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్ తో `కొండ పొలం` రూపొందించారు. ఈ సినిమాల‌న్నీ కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందినా..  క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గా నిలవ‌లేక‌పోయాయి. ఈ క్ర‌మంలో.. ప‌వ‌న్ తో చేస్తున్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` అయినా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందేమో చూడాలి.

Also Read: కొండా జీవితం మీద ఐదారు సినిమాలు తీయవచ్చు

`హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో ప‌వ‌న్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com