'సారంగ దరియా' పాటకు మరింత అందం తీసుకొచ్చిన 'లయ'!
on Jan 28, 2022

'స్వయంవరం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన లయ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'మనోహరం', 'ప్రేమించు' వంటి సినిమాలతో ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకున్న ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలలో నటించి సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు యూట్యూబ్ ప్రేక్షకుకులను కూడా అలరించడానికి సిద్ధమయ్యారు.
యాక్ట్రెస్ లయ టాకీస్(actress laya talkies) పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు లయ. మొదటగా 'సారంగ దరియా' కవర్ సాంగ్ తో ఆమె ప్రేక్షకులను పలకరించారు. 'లవ్ స్టోరి' సినిమాలోని ఈ సాంగ్ ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. ఆ సూపర్ హిట్ సాంగ్ ని రీక్రియేట్ చేస్తూ గ్రాండ్ గా యూట్యూబ్ ఎంట్రీ ఇచ్చారు లయ. తన అందం, నాట్యంతో 'సారంగ దరియా' పాటకు ఆమె మరింత అందం తీసుకొచ్చారు. ఈ కవర్ సాంగ్ కి కొరియోగ్రఫీ కూడా లయే చేయడం విశేషం. ఆమె వేసిన ప్రతి స్టెప్ ఆకట్టుకుంటోంది.
'యాక్ట్రెస్ లయ టాకీస్' లో తాజాగా విడుదలైన 'సారంగ దరియా' కవర్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇలాగే మంచి కంటెంట్ తో రెగ్యులర్ గా యూట్యూబ్ ప్రేక్షకులను అలరించడానికి లయ సిద్ధమయ్యారని తెలుస్తోంది. నటిగా వెండితెరపై, హోస్ట్ గా బుల్లితెరపై తనమైన ముద్ర వేసిన లయ యూట్యూబ్ లోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని మొదటి వీడియోతోనే చెప్పేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



