బావ చివరి చిత్రమిదే: శాంతి
on Dec 4, 2013
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం "ఆర్.... రాజ్ కుమార్". షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకుడు ప్రభుదేవా, హీరో షాహీద్ తో పాటు.. ఈ చిత్రంలో నటించిన శ్రీహరి భార్య శాంతి, అదే విధంగా ఓ ఐటెం సాంగ్ లో మెరిసిన ఛార్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ.. శ్రీహరి నటించిన చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ పూర్తైన చివరి రోజునే ఆయన మరణించారు. కానీ ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుందని, సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. అదే విధంగా ప్రభుదేవా కూడా దర్శకుడిగా మరింత పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆమె అన్నారు.