తేజ దర్శకత్వంలో సాయిపల్లవి?
on Dec 22, 2020
రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే నాయికల్లో సాయిపల్లవి ఒకరు. అయితే.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రాశికి కూడా ప్రాధాన్యమిస్తోందట. ఆ వివరాల్లోకి వెళితే.. ఒకవైపు 'లవ్ స్టోరీ', 'విరాటపర్వం' చిత్రాలు చిత్రీకరణ తుదిదశలో ఉండగనే.. తాజాగా నేచురల్ స్టార్ నానికి జంటగా 'శ్యామ్ సింగ రాయ్'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సాయిపల్లవి.
అంతేకాదు.. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నాయికగా నటించేందుకు సాయిపల్లవి అంగీకరించందని సమాచారం. అలాగే.. ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీకి కూడా ఈ టాలెంటెడ్ బ్యూటీ ఓకే చెప్పిందట. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే.. స్టార్ డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న 'అలివేలుమంగ వేంకటరమణ'. కథ, తన పాత్ర నచ్చడంతో సాయిపల్లవి ఈ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
త్వరలోనే 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్, 'అలివేలుమంగ వేంకటరమణ' చిత్రాల్లో సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మొత్తమ్మీద.. 2021లో సాయిపల్లవి నుంచి 5 చిత్రాలు సందడి చేసే అవకాశముందన్నమాట.