మైత్రీతో ప్రభాస్ కమిట్‌మెంట్?
on Dec 22, 2020
కేరాఫ్ పాన్ ఇండియా మూవీస్.. అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'రాధేశ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్.. ఇలా రానున్న మూడేళ్ళ కాలంలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ సందడి చేయనున్నారు. అంతేకాదు.. తాజాగా మరో పాన్ ఇండియా వెంచర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని టాక్. త్వరలోనే దర్శకుడు, ఇతర వివరాలు వెలువడే అవకాశముంది.
కాగా, పిరియడ్ రొమాంటిక్ సాగాగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' 2021 వేసవిలో విడుదల కానుండగా.. యాక్షన్ సాగాగా రూపొందుతున్న 'సలార్' 2021 దసరాకి సందడి చేయనుందని సమాచారం. ఇక మైథలాజికల్ టచ్ తో రూపొందుతున్న 'ఆదిపురుష్' 2022 ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. అలాగే సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ 2023లో థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read