ప్రముఖ దర్శకుడు పి.సి. రెడ్డి కన్నుమూత
on Jan 3, 2022

విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావును 'బడిపంతులు'గా చూపించిన ప్రముఖ దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి ఈరోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. పి.సి. రెడ్డిగా పాపులర్ అయిన ఆయన పూర్తిపేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. తన కెరీర్‌లో 80 సినిమాల వరకు ఆయన దర్శకత్వం వహించారు. 1970-80ల కాలంలో తెలుగు చిత్రరంగంలోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ను వృద్ధునిగా చూపిస్తూ ఆయన రూపొందించిన 'బడిపంతులు' (1972) సినిమా ఒక క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది.
Also read: ప్రాఫిట్ జోన్‌లో అడుగుపెట్టిన 'శ్యామ్ సింగ రాయ్'!
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మోహన్‌బాబు లాంటి స్టార్లతో పి.సి. రెడ్డి పనిచేశారు. ఎక్కువగా సూపర్‌స్టార్ సినిమాలకు దర్శకత్వం వహించారు. వారి కాంబినేషన్‌లో ఇల్లు ఇల్లాలు, పాడిపంటలు, జన్మజన్మల బంధం, పట్నవాసం, బంగారుభూమి, నా పిలుపే ప్రభంజనం, ముద్దుబిడ్డ, రాజకీయ చదరంగం లాంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. శోభన్‌బాబుతో ఆయన తీసిన విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు, నాయుడు బావ, మానవుడు మహనీయుడు ఘన విజయం సాధించాయి.
Also read: "సగం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాటలకు స్టన్నయిన లక్ష్మి!
ఆయన తీసిన హిట్ సినిమాల్లో పెద్దలు మారాలి, మమత, గౌరి, కొత్త కాపురం, పండంటి సంసారం, భలే అల్లుడు, భోగ భాగ్యాలు, పులిజూదం, రగిలే గుండెలు, తాండవ కృష్ణుడు, అన్నా చెల్లెలు లాంటివి ఉన్నాయి. పి.సి. రెడ్డి మృతికి పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



