వైరల్ అయిన దిల్ రాజు దంపతుల సెల్ఫీ
on May 12, 2020
నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని గుడిలో తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన వివాహం జరిగింది. తేజస్విని ఒక బ్రాహ్మణ యువతి అనే విషయం వెల్లడైంది. అయితే పెళ్లిలో సిద్ధాంతి సూచన మేరకు ఆమె పేరును వైఘారెడ్డిగా మార్చారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి అనే విషయం తెలిసిందే.
రాజు, తేజస్విని పెళ్లి ఫొటోలు ఆన్‌లైన్‌లో ఎంత వైరల్ అయ్యాయో, వివాహానంతరం మంగళవారం వారు తీసుకున్న సెల్ఫీ అంతగానూ వైరల్ అయ్యింది. సాధారణ దుస్తుల్లో ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా నిల్చొని ఉండగా తేజస్విని ఈ సెల్ఫీ తీశారు. వివాహ సమయంలో రాజు ఎంత ఆనందంగా ఉన్నారో నవ్వుతున్న ఆయన ముఖమే తెలియజేస్తోంది. 2017లో ఆయన మొదటి భార్య అనిత ఆకస్మికంగా మృతి చెందారు. వారి కుమార్తె హన్షితారెడ్డి తండ్రి రెండో వివాహానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
