Home

»

Latest News

Dhurandhar 2: కర్ణాటకలో ధురంధర్ 2 సరికొత్త రికార్డు 

Mar 31, 2026

 

-ధురంధర్ 2 టోటల్ కలెక్షన్స్ ఎంత 
-ఈ ప్రవాహం ఆగే ప్రసక్తే లేదా!
-కర్ణాటకలో సాధించిన అరుదైన రికార్డు ఏంటి 

 

ధురంధర్ 2(Dhurandhar 2)కలెక్షన్స్ దెబ్బకి ఆల్ ఏరియాస్ సాహో ధురంధర్ అని ముక్త కంఠంతో చెప్తున్నాయి. థియేటర్స్ ఓనర్స్ అయితే మా థియేటర్ లోనే ధురంధర్ 2 ఆడుతుందని చాలా గర్వంతో చెప్పుకుంటున్నారు. రెండు వారాలు దాటినా సోమవారం సెకండ్ షో   కూడా హౌస్ ఫుల్ అంటే  గర్వంగా చెప్పుకుంటారు కదా! ఇక ధురంధర్ 2 రీసెంట్ గా కర్ణాటక రాష్ట్రంలో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. కర్ణాటకే కాదు.. అన్ని స్టేట్స్ లోను  దాదాపుగా ఇదే పరిస్థితి. కాకపోతే మొదటి వంతు కర్ణాటక వచ్చింది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం. 

ధురంధర్ 2 కర్ణాటకలో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిన తొలి హిందీ మూవీగా నిలిచింది. పైగా రెండు వారాలకే ఆ ఘనతని అందుకోవడం రికార్డు అని చెప్పవచ్చు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కన్నడ సినిమాలు కూడా అంత ఫాస్ట్ గా ఆ స్థాయి కలెక్షన్స్ ని అందుకోలేవు. మరి ఈ లెక్కన లాంగ్ రన్ లో ధురంధర్ 2  కన్నడ నాట ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది.


also read:  Chiranjeevi: చిరంజీవి సరసన స్వాతి.. వైరల్ అవుతున్న రౌడీ అల్లుడు ఓల్డ్ పేపర్ కటింగ్ 


ధురంధర్ 2 ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా 1390 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఈ వాతావరణ సూచనలు ఎంత వరకు వెళ్లి ఆగుతాయో ప్రతి ఒక్కరు చాలా గట్టిగానే అంచనా వేస్తున్నారు. దీంతో ఎండింగ్ ఫిగర్ పై రోజు తమ కుటుంసభ్యులతో, ఫ్రెండ్స్ తో సినీ వాదన చేస్తు ధురంధరుడిలా ఫీల్ అయ్యే వాళ్ళు కోకోల్లలు. ప్రస్తుతానికి అయితే  కొన్ని భారీ చిత్రాల రికార్డ్స్ ధురంధర్ కి సెల్యూట్ చేస్తు పక్కకి జరిగాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com