Home

»

Latest News

Chiranjeevi: చిరంజీవి సరసన స్వాతి.. వైరల్ అవుతున్న రౌడీ అల్లుడు ఓల్డ్ పేపర్ కటింగ్ 

Mar 31, 2026

-రౌడీ అల్లుడు సృష్టించిన సంచలనం తెలిసిందే
-నేటికి చూసే వాళ్ళు ఎంతో మంది 
-మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ ఏంటి 


ఆఫీస్ లో పనిచేసి ఇంటికొచ్చి రిలాక్స్ కోసం సోషల్ మీడియాలో తిష్టవేసి సినిమా వార్తలని ఒక్కొక్కటిగా చూస్తున్నాం. సడెన్ గా చిరంజీవి(Chiranjeevi),రాఘవేంద్రరావు(Raghavendrarao)హిట్ మూవీ 'రౌడీ అల్లుడు'(Rowdy Alludu)కి సంబంధించిన పేపర్ కటింగ్ క్లిప్ కనపడింది. పైగా హీరోయిన్ మ్యాటర్ కి సంబంధించి. దీంతో ఏం చేస్తాం, రోజు పోసుకునే నీళ్లు, రోజు తినే అన్నమే కదా అని ఎవరకి చెప్పకుండా గదిలోకి వెళ్లి ఆ న్యూస్ ని ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన వాడిలా  ఆనందాన్ని ముఖంలో నింపుకొని పదే పదే చదువుతాం. ఇంతకీ ఆ మెగా వార్త ఏంటో విని మనం కూడా ఆ ఆనందం పొందుదాం.

'రౌడీ అల్లుడు'లో శోభన, దివ్యభారతి హీరోయిన్స్ గా చేసిన విషయం తెలిసిందే. శోభన ని ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేసినప్పుడే మరో హీరోయిన్ గా దివ్య భారతిని అనుకున్నారు. కాకపోతే ఆమె బిజీగా ఉంటే మెగాస్టార్ నుంచి వచ్చే సినిమా మరొకటి లేదు కాబట్టి, మూవీ  లేట్ అయితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. కాబట్టి దివ్యభారతి ప్లేస్ లో మరో నాయిక 'స్వాతి'(Swathi)ని సెకండ్ హీరోయిన్ గా  ఫిక్స్ చేసి షూటింగ్ కి వెళ్లాలని 'రౌడీ అల్లుడు' టీం అనుకుంది. సదరు పేపర్ కటింగ్ లో ఈ విషయం మొత్తం స్పష్టంగా ఉంది. దీంతో సదరు వార్తని చూసి ఫ్యాన్స్ తో మూవీ లవర్స్ మురిసిపోతున్నారు. మరి ఈ రోజు రౌడీ అల్లుడు చూడటం పక్కా. ఇక స్వాతి ఎవరో కాదు టాప్ హీరోయిన్ గా తన సత్తా చాటిన టబు(Tabu).  

also read:  Hansika: పాతికేళ్ల కుర్ర హీరోతో హన్సిక రొమాన్స్


1991 అక్టోబర్ 18 న రిలీజైన రౌడీ అల్లుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రికార్డ్స్ సృష్టించి రికార్డ్స్ యొక్క గౌరవాన్ని పెంచింది. చివరకి టబు స్థానంలో దివ్య భారతి(Divya Bharathi)నే ఎంపిక చేసారు. ఆమె పోషించిన 'రేఖ' రోల్ చాలా రఫ్ క్యారక్టర్. మాస్ క్యారక్టర్  ఆటో జానీకి జోడి కాబట్టి సదరు క్యారక్టర్ కూడా బబ్లీ లుక్ తో చిన్నపిల్ల అలవాట్లు ఇంకా  పోనీ చిలిపి పిల్లగా ఉండాలి. దివ్య భారతి పేస్ కట్టింగ్స్ అలాగే ఉంటాయి కాబట్టి  మేకర్స్ ఆమె కోసం ఆగడమో,లేదా తనే డేట్స్ ని అడ్జస్ట్ చేయడమో జరిగి ఉంటుంది. ఇక రౌడీ షూటింగ్ సమయంలోనే టబు చేసిన కూలీ నెంబర్ వన్ సినిమా రిలీజ్ అయ్యింది. 1991  జులై 12 రిలీజ్ డేట్. బహుశా ఆ మూవీ షూటింగ్ టైంలో తన పేరు స్వాతి నుంచి టబుగా మారిందేమో. 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com