Home

»

Latest News

ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు.. రాజకీయ ప్రకటన వివరాలు ఇవే!

Jul 28, 2026 11:25AM

 

 

కొంతమంది హీరోలు ఇమేజ్ కి దూరంగా అన్ని రకాల క్యారెక్టర్స్ పోషిస్తారు. కానీ స్టార్ స్టేటస్ మాత్రం 'నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేసుకో, నేను మాత్రం నిన్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అంటుంటుంది. స్టార్ హీరో ధనుష్(Dhanush)నే అందుకు ఉదాహరణ. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు. దీంతో అభిమానుల సందడి మాములుగా లేదు. 

 అయితే ఈ సారి ధనుష్ తన పుట్టినరోజు సందర్భంగా రాజకీయాల్లోకి వస్తుట్టుగా ప్రకటన చేస్తాడట అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని నెలలుగా తమిళనాడు రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఇళయదళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' అనే పొలిటికల్ పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో  మరికొందరు యువ కథానాయకులు కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ధనుష్ పేరు కొన్ని రోజుల నుంచి వినిపిస్తోంది. ధనుష్ కుటుంబానికి, ముఖ్యంగా ఆయన మాజీ మామ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న రాజకీయ నేపథ్యం అందరికీ తెలిసిందే. రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, ఆయన పొలిటికల్ ఇమేజ్ ధనుష్‌పై కూడా ప్రభావం చూపిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడులో దాదాపు 35 శాతం కంటే ఎక్కువ మంది యువత ఓటర్లు ఉన్నారు. ఈ యువతను ఆకర్షించేందుకు ధనుష్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడికి ఎంతో అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ధనుష్ నటించిన గత 5 సినిమాలు బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ప్రజాదరణని  తెచ్చిపెట్టాయి. తమిళనాడులోని ప్రతి గ్రామంలోనూ బలమైన అభిమాన సంఘాలని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ధనుష్ చేసే సామాజిక సేవా కార్యక్రమాలు, ఆయన ఫ్యాన్ క్లబ్స్ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలు  మంచి పేరు తెచ్చి పెడుతున్నాయి.తమిళనాడు వ్యాప్తంగా సుమారు 10,000 కంటే ఎక్కువ నమోదైన అభిమాన సంఘాలు ధనుష్ సొంతం. ఈ బలమైన నెట్‌వర్క్ రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు పెద్ద సైన్యంగా మారింది. ధనుష్ కేవలం రీల్ హీరోగానే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ యువతకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతాయని భావిస్తున్నారు.


Also read: బాబాయ్, అబ్బాయ్ లకే గాయాలెందుకు.. దిష్టి ఏమైనా తగిలిందంటారా!

అయితే ఈ వార్తలలో నిజమెంత అనేది ఇంకా అధికారికంగా స్పష్టం కాలేదు. పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ ప్రకటన చేస్తాడనేది ఒక రూమర్ మాత్రమే. ప్రస్తుతం అమరన్ ఫేమ్   రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం' అనే మూవీ చేస్తున్నాడు. ధనుష్ కి 77 వ చిత్రం. ధనుష్ తండ్రి కస్తూరి రాజా, సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకులుగా తమిళ చిత్ర  పరిశ్రమతో,ప్రేక్షకులతో సుదీర్ఘ సంబంధ బావ్యాలు ఉన్నాయి. 

Dhanush, Om, Vijay

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com