షాకింగ్.. హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు
on Jan 17, 2022

సినీ సెలబ్రిటీలు నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటన వార్త పూర్తిగా మరవకముందే మరో సినీ జంట విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ ధనుష్, అతని భార్య ఐశ్వర్య తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్యతో ధనుష్ వివాహం 2004లో జరిగింది. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

"18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా కలసిమెలసి ప్రయాణించాం. ఈరోజు మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి" అంటూ ధనుష్ ట్వీట్ చేశాడు. ధనుష్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఐశ్వర్య కూడా తాము విడిపోతున్న విషయాన్ని ఖరారు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



