Robinhood : డేవిడ్ వార్నర్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా..?
on Mar 21, 2025
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్ హుడ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. క్రికెటర్ గా వార్నర్ కి ఎంత క్రేజ్ ఉందో, ఎంటర్టైనర్ గా తెలుగునాట అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. రీల్స్ తో ఎంతో ఎంటర్టైన్ చేస్తాడు. ముఖ్యంగా 'పుష్ప' మూవీ రీల్స్ తో వార్నర్ తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. అలాంటి వార్నర్ ఇప్పుడు 'రాబిన్ హుడ్'తో వెండితెరపై సందడి చేయనున్నాడు. (Robinhood)
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో వార్నర్ సందడి చేయనున్నాడు. ఆయన పాత్ర నిడివి ఐదు నిమిషాలు ఉంటుందట. దీని కోసం వార్నర్ రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. (David Warner)
మాములుగా ఐదు నిమిషాల రోల్ కి రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ అనేది పెద్ద అమౌంటే. అయితే వార్నర్ క్రేజ్.. సినిమాకి బాగానే హెల్ప్ అయ్యే అవకాశముంది. ఆ పరంగా చూస్తే రీజనబుల్ రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో గతంలో 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది. హిట్ కాంబినేషన్ కావడంతో మైత్రి భారీ బడ్జెట్ తో 'రాబిన్ హుడ్'ను నిర్మించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.70 కోట్లని సమాచారం. ఇది నితిన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్. మరి ఈ 'రాబిన్ హుడ్' చిత్రం నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
