Home

»

Latest News

క్రేజీ కళ్యాణం: ఇద్దరు స్టార్స్‌తో పోటీకి సై అంటున్న అనుపమ.!

Oct 6, 2026 6:34PM

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి, నరేష్ వీకే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కళ్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. 

ఈ అక్టోబర్ 30న "క్రేజీ కళ్యాణం" సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రెండు వారాల ముందుగానే ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. 

"క్రేజీ కళ్యాణం" సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ కూడా చాట్ బస్టర్స్ అయ్యాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ తో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అక్టోబర్ 15న రజినీకాంత్ 'జైలర్-2', అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ అక్టోబర్ 30న రిలీజ్ కావాల్సిన క్రేజీ కళ్యాణం.. అక్టోబర్ 16న రావడానికి రెడీ అవ్వడం చూస్తుంటే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందా.. లోకేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో.? 

 

 

 

[Crazy Kalyanam Release Date, Crazy Kalyanam On October 16, Anupama Parameswaran, Tharun Bhascker, Vijay Deverakonda, Ranabaali Release Date, Super Star Rajinikanth, Jailer 2 Release Date, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com