‘కూలీ’ కంటే ‘వార్2’కే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఇది కన్‌ఫర్మ్.. ఎలాగంటే..!
on Aug 7, 2025
అశ్లీల దృశ్యాలు, మితిమీరిన హింస ఉన్నట్టయితే ఆ సినిమాకి ఎ సర్టిఫికెట్ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. తమ సినిమాకి ఎ సర్టిఫికెట్ వచ్చిందంటే దాన్ని పెద్ద అవమానంగా భావించే దర్శకనిర్మాతలు కూడా ఉన్నారు. ఎ సర్టిఫికెట్ యొక్క ప్రధాన ఉద్దేశం.. చిన్న పిల్లలు అలాంటి సినిమాలు చూడకూడదని. అయితే ఇప్పటివరకు దాన్ని సక్రమంగా థియేటర్స్ వారు అమలు చేయలేదు. ఇప్పుడు దాన్ని కఠినంగా అమలు చేసేందుకు థియేటర్ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఈ నిర్ణయం సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే..
రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’కి సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. దీని ప్రకారం 18 సంవత్సరాలలోపు పిల్లల్ని ఈ సినిమాకి అనుమతించరు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా మల్టీపెక్సు సంస్థలు ప్రకటించాయి. వయసు నిర్థారణ లేకుండా థియేటర్‌లోకి ప్రవేశం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం రజినీకాంత్ ఫ్యాన్స్‌కి ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన సింగిల్ థియేటర్లకు కూడా వర్తిస్తుంది. కానీ, సింగిల్ థియేటర్స్ వారు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. దాంతో సినిమా చూసేందుకు అందర్నీ అనుమతిస్తారు. రజినీకాంత్‌కి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అభిమానులు ఉన్నారు. తమ పిల్లల్ని రజినీ సినిమాకి అనుమతించకపోతే ఎలా అని తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.
ఆగస్ట్ 14న కూలీ చిత్రంతోపాటు వార్2 కూడా రిలీజ్ అవుతోంది. మల్టీప్టెక్సులు పెట్టిన నిబంధన వల్ల వార్2కి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలో కూడా వయొలెన్స్ ఉంది. కానీ, ఈ సినిమాకి యుఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు పెద్దవారి పర్యవేక్షణలో పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. మల్టీప్టెక్సులు పెట్టిన ఈ నిబంధనలు కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాదు, ఫుల్ రన్ రికార్డులు కూడా తారుమారవుతాయి. ఇంతకుముందు కూడా మల్టీప్లెక్సుల్లో ఈ నిబంధన ఉంది. కానీ, కూలీ చిత్రానికి మాత్రమే పిల్లల్ని తీసుకురావద్దంటూ ప్రత్యేకంగా ప్రకటించారు. దానికి కారణం.. ఈ విషయం ముందే చెప్పకపోతే థియేటర్స్‌కి పిల్లలతో సహా వచ్చేస్తారు. అప్పుడు వారిని వెనక్కి పంపడం కష్టంతో కూడుకున్న పని. అందుకని ముందే చెప్పేస్తే ఏ సమస్య ఉండదనేది మల్టీప్లెక్సు యాజమాన్యాల ఆలోచన. మరి ఈ విషయంలో అభిమానులు, పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



