కూలీ మనకి ఒకలా, అక్కడి వాళ్ళకి ఒకలా.. ఎందుకు ఈ తేడా!
on Aug 7, 2025

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth),కింగ్ 'నాగార్జున'(Nagarjuna),ఉపేంద్ర,(Upendra),లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'కూలీ'(Coolie)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్(Amir Khan)కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న 'కూలీ' లో 'పూజాహెగ్డే(Pooja Hegde)పై చిత్రీకరించిన 'మోనికా' అనే స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రీసెంట్ గా 'కూలీ' ఓవర్ సీస్(Over Seas)రిలీజ్ కి సంబంధించి సెన్సార్ పూర్తయ్యింది. ఒక్క కట్ కూడా సూచించకుండా యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. దీంతో రెండు గంటల నలబై ఎనిమిది నిమిషాల నిడివితో ఓవర్ సీస్ లో 'కూలీ' ప్రదర్శితం కానుంది. కానీ ఇండియా రిలీజ్ కి సంబంధించి అన్ని భాషల్లోను సెన్సార్ కి వెళ్లగా, మూవీలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయని, కొన్ని కట్స్ ని సూచిస్తు 'A సర్టిఫికెట్' జారీ చేసారు. దీంతో ఓవర్సీస్ లో ఒకలా, ఇండియాలో మరోలా 'కూలీ' ప్రదర్శితం కానుంది. ఇక ఓవర్ సీస్ లో కూలీ ప్రీమియర్స్ కి సంబంధించి ఇప్పటికే 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ప్రీ సేల్ బుకింగ్ లోనే 1 .3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం వినూత్నమైన ప్రచారాన్ని మొదలుపెట్టింది. ప్రముఖ డెలివరీ సంస్థ 'అమెజాన్'(Amazon)తో ఒప్పందం కుదుర్చుకొని 'కూలీ' పేరుతో పాటు నటీనటుల బొమ్మలతో ఉన్న బాక్స్ లని ఎంతో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి, ఇండియా వ్యాప్తంగా ప్రజలకి డోర్ డెలివరీ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది. శృతి హాసన్(Shruthi Haasan)హీరోయిన్ గా చేస్తుండగా సౌభిన్ షాహిర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ 'కూలీ' ని నిర్మించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



