అసలు మీరు తెలుగు వారేనా!
on Aug 7, 2025

సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)కూతురు 'అల్లు అర్హ'(Allu Arha)కి సంబంధించిన ఫన్నీ వీడియోస్ అభిమానులతో పాటు నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటు ఉంటాయి. పైగా ఆ వీడియోస్ కి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు.
రీసెంట్ గా అల్లు అర్జున్ ఇంటికి మంచులక్ష్మి(Manchu Lakshmi)వెళ్ళింది. అర్హ తో మంచులక్ష్మి మాట్లాడుతు నన్ను ఏదో ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నావంట కదా, ఏ ప్రశ్న అని అడిగింది. అర్హ మాట్లాడుతు ' 'మీరు తెలుగు వారేనా అని' అడిగింది. వెంటనే మంచు లక్ష్మి తో సహా అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డి నవ్వుకున్నారు. ఆ తర్వాత అర్హ తో మంచు లక్ష్మి, అల్లు అర్జున్ మాట్లాడుతు నీకెందుకు ఆ డౌట్ వచ్చిందని అనగానే, మీ యాస తెలుగులో ఉందని అర్హ చెప్పడంతో అందరు పెద్దగా నవ్వుకున్నారు. ఈ వీడియోలో మంచు లక్ష్మి, అర్హ కనపడగా అల్లు అర్జున్, స్నేహరెడ్డి(Sneha Reddy)వాయిస్,మరియు నవ్వులు వినపడ్డాయి. అల్లు అర్హ బాలనటిగా 'శాకుంతలం' సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



