Home

»

Latest News

17 ఏళ్ళ త‌రువాత వేస‌వి బ‌రిలో చిరు!

Jan 21, 2022 2:23PM

`య‌ముడికి మొగుడు` (1988), `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` (1990), `గ్యాంగ్ లీడ‌ర్` (1991), `ఘ‌రానా మొగుడు` (1992).. ఇలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోని సింహ‌భాగం ఇండ‌స్ట్రీ హిట్స్ స‌మ్మ‌ర్ సీజ‌న్ లో సంద‌డి చేసిన సినిమాలే.  క‌ట్ చేస్తే.. ఇప్పుడ‌దే ల‌క్కీ సీజ‌న్ లో త‌న తాజా చిత్రం `ఆచార్య‌` కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. త‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి చిరు న‌టించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 1న థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

Also read: మెగాస్టార్ ఏప్రిల్ హిట్స్ లో `ఆచార్య‌` చేరుతుందా!?

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. 17 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి వ‌స్తున్న స‌మ్మ‌ర్ మూవీ `ఆచార్య‌`నే కావ‌డం గ‌మ‌నార్హం. చివ‌రిసారిగా త‌న‌ ద్విపాత్రాభిన‌యంలో రూపొందిన `అంద‌రివాడు`తో వేస‌విలో వినోదాలు పంచారు చిరు. 2005 జూన్ 4న విడుద‌లైన `అంద‌రివాడు` యావ‌రేజ్ గా నిలిచింది. మ‌రి.. 17 ఏళ్ళ త‌రువాత స‌మ్మ‌ర్ బ‌రిలో దిగుతున్న మెగాస్టార్ ఈ సారి ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటారో చూడాలి.

Also Read: విడాకులు సంగీత్ తో సెలెబ్రేట్ చేసుకోవాలి

కాగా, `ఆచార్య‌`ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించారు. మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించిన ఈ సినిమాలో చిరుకి జంట‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుంది. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హెగ్డే ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com