Home

»

Latest News

పోలీసుల‌కు మెగాస్టార్ సెల్యూట్‌.. తెలంగాణ డీజీపీ రెస్పాన్స్‌!

Apr 10, 2020 2:49PM

 

లాక్‌డౌన్ నేప‌థ్యంలో పోలీసుల ప‌నితీరును మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంసించారు. రేయింబ‌వ‌ళ్లు వాళ్లు క‌ష్ట‌ప‌డుతున్న తీరువ‌ల్లే లాక్‌డౌన్ విజ‌య‌వంతంగా న‌డుస్తోంద‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సందేశంలో తెలిపారు. ప్ర‌జ‌లంతా పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోరారు. చిరంజీవి సందేశానికి తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ప్ర‌తిస్పందించారు. త‌న అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్‌లో చిరు పోస్ట్‌ను రిట్వీట్ చేసి, పోలీసుల‌కు, ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తినిచ్చార‌ని కొనియాడారు.

"రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల ప‌నితీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వాళ్లు ప‌డుతున్న‌టువంటి క‌ష్టం అంతా ఇంతా కాదు. నేను హైద‌రాబాద్‌లో స్వ‌యంగా చూస్తున్నాను. వారి ప‌నితీరు వ‌ల్ల లాక్‌డౌన్ చాలా స‌క్సెస్‌ఫుల్‌గా జ‌రిగింద‌ని చెప్పాలి. అలా జ‌ర‌గ‌బ‌ట్టే ఈ క‌రోనా విజృంభ‌ణ‌ చాలావ‌ర‌కు అదుపులోకి వ‌చ్చింది. అలాగే నేను ప్ర‌తి ఒక్క‌రినీ వేడుకుంటున్నాను.. సామాన్య జ‌నం కూడా పోలీసుల‌కు స‌హ‌క‌రించాలి. ఈ క‌రోనాని తుద‌ముట్టించ‌డంలో, అంత‌మొందించ‌డంలో వారికి చేదోడువాదోడుగా మ‌న‌మంద‌రం ఉండాలి. పోలీసువారు చేస్తున్న ఈ అమోఘ‌మైన‌టువంటి ప్ర‌య‌త్నానికి పోలీసు బిడ్డ‌గా వారికి చేయెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్" అని చిరంజీవి సోష‌ల్ మీడియాలో వీడియో సందేశం పెట్టారు.

ఈ పోస్ట్‌ను తెలంగాణ డీజీపీ ఎం. మ‌హేంద‌ర్‌రెడ్డి రిట్వీట్ చేసి, "మీరు మమ్మ‌ల్ని మాత్ర‌మే కాదు, మొత్తం బ‌ల‌గాల‌ను ఇన్‌స్పైర్ చేశారు. అంతేకాదు, మీ ద్వారా ప్రేర‌ణ చెందే అనేక‌మంది ప్రేక్ష‌కుల్నిమేల్కొలిపారు. పోలీసు కుటుంబం స‌భ్యుడిగా ఉండ‌టం అనే మాటకు చాలా అర్థ‌ముంది. అది కోవిడ్ 19పై పోరాటంలో మాకు గొప్ప‌గా సాయ‌ప‌డుతుంది. మీ మాట‌లు క‌చ్చితంగా అంద‌రినీ లాక్‌డౌన్‌ను గౌర‌వించేలా చేస్తాయి" అని త‌న అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com