Home

»

Latest News

కమల్ హాసన్‌తో సినిమా: ‘మెగావర్స్’లో  చిరంజీవి క్రేజీ ప్రామిస్.!

Oct 30, 2026 12:01PM

మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్.. ఇద్దరూ భారతీయ చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటులు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించి చాలా ఏళ్లయింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థలో కావడం విశేషం. తాజాగా చిరంజీవి హోస్ట్ చేస్తున్న ‘మెగావర్స్’ టాక్ షోలో ఈ క్రేజీ ప్రామిస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి చిరంజీవి ఇప్పటివరకు వెండితెరపైనే తన అభిమానులను అలరించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘మెగావర్స్’ పేరుతో టాక్ షోకు హోస్ట్‌గా మారుతున్నారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ‘మాస్‌కి గ్రామర్.. స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ ఈజ్ హియర్’ అంటూ చేసిన ప్రకటన అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది.

ఈ టాక్ షోలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఓ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. మొత్తం 12 నుంచి 15 ఎపిసోడ్లతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

‘మెగావర్స్’లో కమల్ హాసన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన హైదరాబాద్‌కు రావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దాదాపు 47 ఏళ్ల క్రితం 1979లో విడుదలైన కె. బాలచందర్ దర్శకత్వంలోని ‘ఇది కథ కాదు’ సినిమాలో చిరంజీవి, కమల్ హాసన్ కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించే అవకాశం రాలేదు. ఇప్పుడు ‘మెగావర్స్’తో ఆ అరుదైన కలయిక సాధ్యమవుతుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ప్రచారంలోకి వచ్చింది. ఈ టాక్ షోలో జరిగిన సంభాషణల సందర్భంగా కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌లో ఓ సినిమా చేయాలని చిరంజీవిని కోరారట. అందుకు చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించి సినిమా చేయడానికి మాట ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గతంలో కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం కూడా నటుడిగానే కాకుండా నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సంస్థలో చిరంజీవి సినిమా చేస్తే అది కచ్చితంగా ఆసక్తికరమైన కాంబినేషన్ అవుతుంది.

ఇది కూడా చదవండి: హన్సిక ప్రైవేట్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ క్లిప్స్.!

 

 

 

[Chiranjeevi Kamal Haasan Movie, Chiranjeevi Promises Kamal Haasan, Chiranjeevi MegaVerse, Kamal Haasan MegaVerse, Chiranjeevi OTT Show, Netflix MegaVerse, Chiranjeevi, Kamal Haasan, Telugu Film News] 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com