చిరంజీవి భార్యను ఉప్పు చేపల కూర అడిగిన కైకాల!
on Dec 23, 2022

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ట మరణం మరువకముందే మరో లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శుక్రవారం (డిసెంబర్ 23) తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు కైకాలకు నివాళులు అర్పిస్తున్నారు. కైకాలతో చిరంజీవి కుటుంబానికి మంది అనుబంధం వుంది. కైకాల సత్యనారాయణకు నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... ‘‘కైకాలగారు మంచి భోజన ప్రియులు. ఆయనకు సురేఖ వంటలంటే భలే ఇష్టం. ప్రతీ పుట్టినరోజు నాడు నేను నా భార్య సురేఖ ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతాము.
ఈ సంవత్సరం కూడా సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లిన సందర్భంలో సురేఖను కైకాల గారు ‘అమ్మా నాకు ఉప్పు చేపల కూర వండి పంపించు. అదంటే నాకు చాలా ఇష్టం’ అని అడిగారు. ‘మీ హెల్త్ సరిగా లేదు కదా... మీరు త్వరగా కోలుకోండి. మనందరం కలిసి ఉప్పు చేపల కూరతో మంచి భోజనం చేద్దాము’ అని నేను సురేఖ అన్నాము. మేము ఆ మాట అనే సరికి కైకాలగారు చిన్నపిల్లాడిలా ఎంతో సంతోష పడ్డారు.
ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్నాను’’ అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



